| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

తమ పిల్లల్ని చేర్పిస్తున్న సమైక్య సంఘాల అధ్యక్షురాలు జ్యోతి

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దమ్మన్నపెట ఉపాధ్యాయులచే ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని దమన్నపేట గ్రామంలో నిర్వహించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు ఈ సందర్భంగా గ్రామంలో అర్హత కలిగిన విద్యార్థుల వద్ద కు వెళ్లి వారి పేర్లను నమోదు చేయడం జరిగిందని తెలిపారు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి మంచి స్పందన లభించిందని తెలిపారు తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలోనే మా పిల్లలను చేర్పించి ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటామని వారి అభిప్రాయాన్ని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింతపల్లి వెంకటేశ్వర్రావు సమైక్య సంఘాల అధ్యక్షురాలు జ్యోతి సీనియర్ ఉపాధ్యాయులు బోయన్నగారి  నారాయణ తాడూరి సంపత్ కుమార్ మారేపల్లి రాజు గుడి కాడి కొమురయ్య శనిగరం నారాయణ అజ్మీర కవిత జడల విజయశ్రీ మరియు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి  శైలజ తదితరులు పాల్గొన్నారు

Previous జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడిని ఖండించిన ఆర్‌ఎస్‌ఎస్‌
Next ఏసీబీకి చిక్కిన నీటిపారుదల శాఖ అధికారులు
ADVERTISEMENT