హృదయవిదారకం.. జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడిని ఖండించిన ఆర్‌ఎస్‌ఎస్
డైలీ భారత్, జమ్మూ కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించింది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS). ఈ దాడి అత్యంత దారుణమని, హృదయ విదారకమైనదని ఆర్‌ఎస్‌ఎస్ కీలక నేత దత్తాత్రేయ హోసబాలే పేర్కొన్నారు.
ఇది మన దేశ ఐక్యత, సమగ్రతపై దాడి. అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు తమ విభేదాలకు అతీతంగా ఈ ఉగ్రవాద చర్యను ఖండించాలని ఆర్‌ఎస్‌ఎస్ పిలుపునిచ్చింది.
ఇది మన దేశ ఐక్యత, సమగ్రతపై దాడి.
ఈ దాడికి కారణమైన వ్యక్తులకు తగిన శిక్ష విధించేలా చూడాలని తెలిపింది.