| Daily భారత్
Logo




కల్తీ ఆహారాలపై అవగాహన పెంచుకోవాలి

News

Posted on 2025-04-21 19:59:00

Share: Share


కల్తీ ఆహారాలపై అవగాహన పెంచుకోవాలి

గ్రామీణ ప్రాంతాలు కల్తీ ఆహారంపై వినియోగదారులకు చైతన్యం చాలా అవసరం

సిసిఐ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ చదలవాడ హరిబాబు

సిసిఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మామిడి భీమ్ రెడ్డి

కార్యక్రమాన్ని నిర్వహించిన డాక్టర్ వెంకన్న బాబు, ప్రవీణ, సువర్ణ

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులను చైతన్యం చేయవలసిన బాధ్యత అందరి మీద ఉన్నదన్ని కన్జ్యూమర్ కాన్ఫ్రైడేషన్ సీనియర్ ఉపాధ్యక్షులు డాక్టర్ చదలవాడ హరి బాబు అన్నారు. సోమవారం షాద్ నగర్ లో అగ్మార్క్ డిపార్ట్మెంట్ మరియు సిసిఐ తెలంగాణ స్టేట్ కార్యవర్గం సంయుక్తంగా కల్తీలపై నిర్వహించారు. కల్తీలను ఏ విధంగా కనుగొనాలి అనే దానిపై జరిగిన అవగాహన సదస్సుకు కాన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ చదలవాడ హరిబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 

నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ హరిబాబు మాట్లాడుతూ..

కలియుగం అనే కన్నా కల్తీ యుగం అనాలి ఎందుకంటే పిల్లలు తాగే పాలు దగ్గర్నుంచి, టీ పొడి ,కారంపొడి ,పసుపు పొడి వెల్లుల్లిఆల్లం తోచేసిన పేస్టు మరియు ఫ్రిజ్లలో కుళ్ళిన మటను చికెన్ల తోటి రుచికరముగా బిర్యానీలు చేసి వండి వడ్డిస్తున్న హోటల్స్,బరండ్ రెస్టారెంట్ వారు బాగా కాగిన  నూనెలో బజ్జీలు పునుగులు చేస్తున్నారు. అలాంటి ఆహారం అందిస్తున్న వ్యాపారస్తులు వల్ల అనారోగ్యంతో ఆసుపత్రుల్లో పాలవుతున్న వినియోగదారులును రక్షించవలసిన బాధ్యత ప్రతి వినియోగదారుల సంఘాల నాయకుల పై ఉన్నదని హరిబాబు అన్నారు. ఈ సభకు సిసిఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి భీమిరెడ్డి అధ్యక్షత వహించారు. హరిబాబు ప్రసంగాన్ని కొనసాగిస్తూ అసత్య ప్రకటనలలో కనిపిస్తున్న సిని స్టార్స్ బ్రాండ్ అంబాసిడర్స్ను కూడా 2019 వినియోగదారుల చట్ట ప్రకారము ఐదు సంవత్సరముల కఠిన కారాగార శిక్ష మరియు ఐదు లక్షల రూపాయల వరకు జరిమానా  కమిషన్ వారువిధించవచ్చని చట్టంలో పొందుపరచడం జరిగిందన్నారు. 

సిసిఐ రాష్ట్ర అధ్యక్షుడు భీమ్ రెడ్డి మాట్లాడుతూ...

ఈ ఏడాది జూన్ ఆఖరి నుండి హై స్కూల్స్ కళాశాలలో వినియోగదారుల విద్యార్థుల క్లబ్ ను ఏర్పాటుచేసి ప్రతినెల రెండు రోజులు వారికి బిఐఎస్ యాప్ మీద మరియు అగ్మార్క్ ప్రొడక్ట్స్ మీద మనం నిత్యం తినే ఆహార వస్తువులలో పసుపు కారం పాలు ఛాయాపతి వీటి మీద అగ్మార్క్ అధికారులతో శిక్షణా తరగతులు నిర్వహించే ప్రతి విద్యార్థికి సర్టిఫికెట్ అందజేయడం కార్యక్రమము ఏర్పాటు చేయడం జరుగుతుందని వెల్లడించారు. అదేవిధంగా బంగారంలో కేడియం బదులు ఇరీడియం అనే కెమికల్ పౌడర్ కలపటం వలన వాటితో తయారుచేసిన ఆభరణాలు ధరించిన మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని భీమిరెడ్డి అన్నారు.

డాక్టరు వెంక్కన్న బాబు మాట్లాడుతూ..

మనం ఉపయోగిస్తున్న నీల క్యాన్ లోని వాటర్ మరియు బ్రాండెడ్ వాటర్ బాటిల్స్ లో మినరల్స్ లేవని వ్యక్తి బజార్లో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఆర్వో వాటర్ ప్లాంట్స్ అన్నీ కూడా మనము యనలసిస్, వాటర్ కెమికల్ ఎనాలిసిస్ కు పంపిస్తే ల్యాబ్ వారు అన్ సేఫ్ అని రిపోర్ట్ ఇస్తున్నారు కనుక అలాంటి వాటర్ గనుక తగిన వారు ఆత్రైడ్స్అనే కీళ్ల నొప్పులకు మరియు ఊబకాయం వస్తుందని మున్సిపల్ అధికారులు సప్లై చేయుచున్న వాటర్ ను కాచి వడబోసుకొని త్రాగటం మంచిదని వెంకన్న బాబు అన్నారు  సీసీఐ  జనరల్ సెక్రటరీ సుప్రభ ప్రసంగిస్తూ సాయంత్రం పూట మనం తినే పానీపూరీలు లో వాడుతున్న వాటర్ మంచిది కాదని ఆ వాటర్ లో ఈకోలియా బ్యాక్టీరియా ఉంటుందని వాటిని తిన్నా వారు మరణించడం జరుగుతుందన్నారు.కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల పానీపూరీలు బ్యాన్ చేయడం జరిగినది అన్నారు. కార్యక్రమంలో సీసీ తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ  ప్రవీణ ప్రసంగిస్తూ   సిటీ నుండి గల్లీ వరకు కర్రీ పాయింట్ వారు వాడే టేస్టెడ్ సాల్ట్ ను అధిక మొత్తంలో వాడుతున్నందున ఆ వంటలు తిన్నా వినియోగదారులుకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నదని నిపుణులు చెప్తున్నారు అన్నారు. ఆగమార్క్ డిపార్ట్మెంట్ చీఫ్ కమిస్టు సుభాషిని మరియు జూనియర్ కెమిస్ట్ కుసుము కుమారి నెయ్యి, పాలు ,తేనె పదార్థాల్లో కల్తి ఎలా కనుగొనవచ్చు చూపించారు అలానే రంగు కలిపిన భటానీలు  మిరియాలలో బొప్పాయి గింజలు   కలిపినవి పసుపు, కారం పొడిలలో వ్యాపారస్తులు ఎలా కల్తీ చేస్తున్నారు.చిన్నచిన్న ప్రయోగాల ద్వారా చూపించడం జరిగినది. అనంతరం గ్రంథాలయ వైస్ చైర్మన్ లు నక్క బాలరాజ్, వీరేష్ అయూబ్  ఖాన్,సువర్ణ ,మాధురి గోపాల నారాయణ ,సత్యనారాయణ రెడ్డి,  మల్లికార్జున్ నాయక్ వివిధ అంశముల మీద మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రవీందర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, నర్సింలు, అర్జున్ రెడ్డి, బాలరాజ్, వెంకట రమణ, ప్రభు, ఆంజనేయులు గౌడ్, శ్రీరాముల గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

ప్రభుత్వ వైద్య సేవలపై వివరించాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-03-12 22:25:21

Readmore >
Image 1

దేశంలో ఎల్పిజి కొరతపై కేంద్రం సంచలన ప్రకటన చేసింది

Posted On 2026-03-12 21:54:50

Readmore >
Image 1

హైదరాబాద్‌లో పారిశుధ్య సమస్యలను నివేదించడానికి వాట్సాప్ సౌకర్యం ప్రవేశపెట్టబడింది

Posted On 2026-03-12 21:53:55

Readmore >
Image 1

శుక్రవారం నాడు అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు బేబీ కిట్స్ పంపిణీ కార్యక్రమం

Posted On 2026-03-12 21:52:35

Readmore >
Image 1

వరంగల్: అంతర్ జిల్లా కరెంట్ మోటార్ల దొంగల ముఠా అరెస్ట్

Posted On 2026-03-12 19:38:16

Readmore >
Image 1

కామారెడ్డిలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలి : కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

Posted On 2026-03-12 18:49:30

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా గురువారం పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-03-12 18:47:14

Readmore >
Image 1

బిజెపి నుండి గెలిచిన 16 మంది కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ ల కు సన్మానం చేసిన బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతరాజు వెంకటేశ్ పెరిక

Posted On 2026-03-12 18:45:43

Readmore >
Image 1

79 సంవత్సరాల క్రితం (1947), శబరిమల తీర్థయాత్ర

Posted On 2026-03-12 18:43:20

Readmore >
Image 1

భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య

Posted On 2026-03-12 18:24:55

Readmore >