డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: డాక్టర్ యెలగొండ ఆంజనేయులు ఆంగ్ల విభాగాదిపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ గంభీరావుపేట ఈరోజు ఎక్స్టెన్షన్ లెక్చర్ ఆన్ "బ్రోకెన్ ఇంగ్లీష్ టు స్పోకెన్ ఇంగ్లీష్" అనే అంశంపై గ్రామర్ పద్ధతిలో కాకుండా అత్యంత సులభమైన టిప్స్ ద్వారా తెలుగు నుంచి ఇంగ్లీషులోకి ఏ విధంగా భయం లేకుండా మాట్లాడవచ్చు, రాయవచ్చును, పోయెట్రిక్ ఎక్స్ ప్రెసన్, ప్రనన్షియేషన్ స్కిల్స్ తదితర ఆంగ్ల భాష నైపుణ్యాలను మెరుగు పరుచుకోవటం మూలంగా ఎలాంటి అద్భుతమైన అవకాశాలను ప్రపంచ వ్యాప్తంగా అందిపుచ్చుకోవడంలో ఎంతగానో దోహదపడుతుందని విద్యార్థినీ విద్యార్థులకు పలు రకాల ఉదాహరణలతో తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ శంకర్, ఆంగ్ల విభాగాదిపతి డాక్టర్ యం. శోభారాణి, మహేందర్ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ తదితర అధ్యాపక బృందం పాల్గొన్నారు.