డైరీ భారత్, హైదరాబాద్:తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.
అనంతరం ఆయన మాట్లా డుతూ,అమర వీరుల ఆకాంక్షలను నెరవేరు స్తామన్నారు. త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడిందన్నారు.
తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాము లన్నారు. పోరాటాలు, త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చిందన్నారు.
ప్రజాభవన్ దగ్గర కంచెను బద్దలు కొట్టామన్నారు. ప్రజాభవన్ కు ప్రజలు ఎప్పుడైనా రావొచ్చన్నారు.
ప్రసంగం ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అభయ హస్తం ఫైల్ ఆరు గ్యారం టీలపై తొలి సంతకం చేశారు..