రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శశిధర్ రెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : జిల్లా న్యాయ సేవాసంస్థ, రంగారెడ్డి మరియు లయన్స్ ఇంటర్నేషనల్ వారి అద్వర్యం లో సరూర్నగర్ ఇన్డోర్ స్టేడియం లో మాదక ద్రవ్యాల మీద ప్రైవేట్ స్కూల్ విద్యార్థులతో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శశిధర్ రెడ్డి,తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య,జిల్లా మొదటి అదనపు జిల్లా జడ్జి డాక్టర్ పట్టాభి రామారావు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇష్టమైన పదార్థాలు తింటాం సంతోషంగా అనిపిస్తుంది నచ్చిన సంగీతం వింటాం మదినిండా ఉల్లాసం నిండుతుంది సరిగ్గా మాదకద్రవ్యాలు కూడా ముందు ఇలాగే ఉరుస్తాయి ఆనందం సంతోషం ధైర్యం ఆత్మవిశ్వాసం వంటి భావనలు పెద్ద ఎత్తున ప్రేరేపించి ఆనంద డోలికల్లో తేలాడేలా చేస్తాయి కానీ అంతటితోనే ఆగిపోవు వీటి ప్రభావం తగ్గగానే మనసును తీవ్ర ఆందోళనతో కుదిపేస్తాయి, తిరిగి తీసుకునేంత వరకు అది పెద్ద మొత్తంలో తరచుగా తీసుకునేంతవరకు కుదురుగా నిలబడనీయవు ఇలా క్రమంగా మనసును మనిషిని పూర్తిగా లోబరుచుకుంటాయి. ఈ మాదక ద్రవ్యాలు ప్రవర్తనను నడవడికను పూర్తిగా దెబ్బతీసి భవిష్యత్తు మొత్తాన్ని అంధకారంలోకి నేడుతాయి. మాదకద్రవ్యాలు మానసికంగానే కాదు శారీరకంగాను తీవ్ర ప్రభావం చూపుతాయి చాలామంది వీటిని మొదట్లో తక్కువ మోతాదు తోనే ఆరంభిస్తారు ఈ దశలో మనసులో ఒక రకమైన ఉల్లాసం పుట్టుకొస్తుంది ఆందోళన తొలగిపోయి ఆత్మవిశ్వాసం ధైర్యం లభించినట్టు అనిపిస్తుంది. ప్రభుత్వం మాదకద్రవ్యాల నియంత్రణ కోసం కఠినమైన చట్టాలు అమలు చేస్తోంది. మత్తు పదార్థాల తయారీ, సరఫరా, వినియోగం కఠినంగా నిషేధించబడింది. విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు డ్రగ్స్ వ్యతిరేక ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. మనం మాదకద్రవ్యాల ప్రాబల్యంపై అవగాహన కలిగి ఉండాలి, పిల్లలు, యువత సరైన మార్గంలో ప్రోత్సహించాలి, సరైన స్నేహితులను ఎన్నుకోవడం ముఖ్యం, ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం పెంచుకోవాలి.పిల్లలకు స్వాతంత్రం ఇవ్వడమే కాదు దాన్ని వాళ్ళు ఎలా వినియోగించుకుంటున్నారనే దానిపై తల్లితండ్రులు కచ్చితంగా దృష్టి పెట్టాలి. పిల్లలు ప్రపంచాన్ని చూసి నేర్చుకుంటారని అనుకోవడంలో తప్పులేదు కానీ యుక్త వయసులో బాధ్యత రాహిత్యం ఎక్కువ అని సంగతి గుర్తించాలి,ప్రస్తుతం సమాజం బాగా మారిపోయింది మొబైల్ ఫోన్లు వంటి వస్తువులపై వ్యామోహం పెరిగింది. కనుక తల్లితండ్రులు కూడా తమ పిల్లలపై దృష్టి పెట్టడం ద్వారా ఈ మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి కొంతవరకు బయటపడవచ్చు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావు, లయన్స్ డిస్టిక్ గవర్నర్ గంప నాగేశ్వరరావు ,మల్టిపుల్ కౌన్సిల్ చైర్ పర్సన్ రాజి రెడ్డి, మల్టిపుల్ లియో కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి, పాననీయ విద్యాసంస్థల డైరెక్టర్ వసుధ, వివిధ పాఠశాలల ప్రిన్సిపాల్, స్కూలు పిల్లలు మరియు న్యాయ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.