| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఉపరాష్ట్రపతి ధన్ ఖడ్ ను పరామర్శించిన ఎంపీ రవిచంద్ర

ఉపరాష్ట్రపతి ధన్ ఖడ్ ను పరామర్శించిన ఎంపీ రవిచంద్ర

డైలీ భారత్, న్యూఢిల్లీ: ఇటీవలే అనారోగ్యానికి గురై విశ్రాంతి తర్వాత కోలుకుని పార్లమెంట్ కు హాజరైన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ను బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఉప నేత, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సహచర ఎంపీలతో కలిసి సోమవారం పరామర్శించారు. పార్లమెంట్ ఆవరణలోని రాజ్యసభ చైర్మన్ ఛాంబర్లో ఈ మేరకు ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. ప్రజలు, దేవుని ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవడం పట్ల ఎంపీ రవిచంద్ర ఆనందం వ్యక్తం చేశారు.  మరింత కాలం ప్రజా సేవకు అంకితం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతిని కలిసి పరామర్శించిన వారిలో తెలంగాణకు చెందిన భాజపా ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ కూడా ఉన్నారు.

Previous నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ కి ఘనంగా స్వాగతం పలికిన తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్
Next అక్రమంగా ఎస్సీ కుల దృవీకరణ పత్రం పొందిన వారిపై చర్యలు తీసుకోవాలనీ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మార్వో, ఎస్ఐ కి మెమరండం
ADVERTISEMENT