భాదిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు
డైలీ భారత్, మణుగూరు : మండల పరిధిలోని పగిడేరు గ్రామంలో శనివారం జరిగిన అగ్నిప్రమాదంలో పూరిల్లు దగ్ధమైన ఘటనలో సర్వం కోల్పోయి, నిరాశ్రయులుగా మారిన కుంజా కేశవరావు కుటుంబానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కేటాయించి, ఆ కుటుంబాన్ని తక్షణమే ఆర్థికంగా ఆదుకోవాలని, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులతో కలిసి ఆయన ఆదివారం పగిడేరు గ్రామంలో పర్యటించారు. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గ్రామానికి చెందిన శరం లక్ష్మయ్య, కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుంజా కేశవరావు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మచ్చా వెంకటేశ్వర్లు విలేకరులతో మాట్లాడుతూ.. అగ్ని ప్రమాద ఘటనతో కేశవరావు కుటుంబం పూర్తిగా నష్టపోయిందన్నారు.విలువైన వస్తువులు డబ్బులు బంగారం 1.50.000 పూర్తిగా కాలిపోయాయన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. తక్షణమే విపత్తుల సహాయం కింద ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని రెవెన్యూ అధికారులను కోరారు.
ఎటువంటి షరతులు లేకుండా తక్షణమే భాదిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ప్రకటించాలన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోలగాని బ్రహ్మచారి,సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న, కరకగూడెం మండల కార్యదర్శి కొమరం కాంతారావు, సిపిఎం పగిడేరు శాఖ కార్యదర్శి. కుంజా నరసింహారావు, కుంజా రాజా తదితరులు పాల్గొన్నారు.