డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని 36 వ వార్డు సుందరయ్య నగర్ సిక్కువాడలో నీటిబోరు మోటార్ పని చేయక నీటి కొరత ఉందని తెలుసుకున్న మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజు తక్షణమే స్వంత ఖర్చులు 6,000/- రూపాయలు వెచ్చించి ఆ బోరు మోటార్ కు మరమ్మతులు చేయించి వార్డు ప్రజలకు దాహార్తిని తీర్చారు. ఎండాకాలంలో నీటి కొరతతో ఎవరూ ఇబ్బంది పడద్దని అవసరమైతే నీటి ట్యాన్కర్ ద్వారా సరఫరా చేస్తానని తెలిపారు. దయచేసి ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని నీటిని వృథా చేయవద్దని కోరారు.
ఎండాకాలం ఉన్నందున ప్రజలు బోర్ మోటార్ ను ఉదయం, మరియు సాయంత్రం వేళల్లో మాత్రమే వినియోగించుకోగలరని మనవి