డైలీ భారత్, తెలంగాణ: తెలంగాణలో మైకులన్నీ మూగబోయాయి. నెల రోజులుగా మారుమోగిన పల్లెలన్ని ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాయి. అయితే.. అంతే సైలెంట్‌గా పైసలు చేతులు మారుతున్నాయి. నగదు ప్రవాహానికి పోలీసులు ఎంత అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించినా.. డబ్బు పంపిణీ మాత్రం జరుగుతూనే ఉంది. కాగా.. ఓ గ్రామంలో డబ్బు ఇవ్వటానికి స్పెషల్ కండీషన్ పెట్టాడు ఓ ప్రతినిధి. తమ పార్టీ గుర్తుకే ఓటేస్తానని దేవుడి మీద ఓటెస్తానని ఒట్టేస్తేనే చేతికి నోట్లు ఇస్తున్నాడు.
watch the video :
https://youtube.com/shorts/nilCs4ycnKg?si=ChTwGSuAVmySvdU7
తెలంగాణ ఎన్నికల్లో కీలక ఘట్టమైన ప్రచార పర్వం ముగిసింది. అంతా పోలింగ్ (Telangana Polling day) రోజైన నవంబర్ 30 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. మధ్యలో మిగిలిన సమయాన్ని రాజకీయ పార్టీల నేతలు ఎంతో జాగ్రత్తగా వినియోగించుకోనున్నారు. ప్రచారంలో భాగంగా.. ఆకర్షణీయమైన హామీలు, ఆకట్టుకునే ఆఫర్లు ఇలా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చాలా ప్రయత్నాలు చేసిన నేతలు.. ఇప్పుడు చివరి అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. అదేనండి ఓటుకు నోటు. ఫలితం ముందే ఊహించదగిన స్థానాల్లో ఓటుకు నామమాత్రపు విలువ కడుతున్న నేతలు.. గట్టి పోటీ ఉన్న నియోజకవర్గాల్లో మాత్రం ఓటుకు మంచి డిమాండే ఉంది. అలాంటి స్థానాల్లో ఓటు విలువ.. రెండు వేల పైమాటే. అయితే.. కొన్ని చోట్ల కేవలం ఓటుకు నగదు ఇవ్వటమే కాదు.. ఆ ఓటర్ల దగ్గరి నుంచి తమ గుర్తుకే ఓటు వేస్తామంటూ మాట తీసుకుంటున్నారు.