డైలీ భారత్ రాజన్న సిరిసిల్ల : తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ చిన్నారికి కుక్కల ద్వారా వైరస్ సోకి అస్వస్థత కు గురైంది, ప్రస్తుతం చిన్నారి హైదరాబాదులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది, తెలిసిన వివరాల ప్రకారం...
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తికి చెందిన చేపూరి శ్రీమేధ (4) అనే చిన్నారికి జ్వరం, అలర్జీ రావడంతో సిరిసిల్లలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ఎన్ని పరీక్షలు చేసినా వ్యాధి నిర్ధారణ కాకపోవ డంతో నాలుగు రోజుల క్రితం చిన్నారిని హైదరాబా ద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు “బ్రూసెల్లా ఇథిపికల్” అనే వైరస్ సోకిందని, ఇది సామాన్యంగా కుక్కలకు వచ్చే వైరస్ అని తేల్చారు.
ఆ వైరస్ వచ్చిన కుక్కల మధ్య ఆడుకోవడంతో చిన్నారికి కూడా సోకి ఉంటుందని వైద్యులు వివరించారు. కలుషితమైన చికెన్ వ్యర్ధాలు కలుషిత మైననీటిని తాగడం పచ్చి మాంసం వ్యర్ధాలు తినడం ద్వారా కుక్కలకు ఈ వ్యాధి సోకుతుందని, వైద్యు తెలిపారు. వైరస్ సోకిన కుక్కలు తిరిగిన ప్రాంతంలో చిన్నారులు తిరిగితే వైరస్ సోకే ప్రమాదం ఉందన్నారు.