| Daily భారత్
Logo




వెకిలి చేష్టలు చేస్తున్న నారాయణ కాలేజీ విద్యార్థులు

News

Posted on 2025-02-05 09:58:54

Share: Share


వెకిలి చేష్టలు చేస్తున్న నారాయణ కాలేజీ విద్యార్థులు

దుస్తులు లేకుండా ఆంటీ ఆంటీ ..అంటూ వెకిలి చేష్టలు.. నారాయణ కాలేజీ ముందు మహిళల ఆందోళన.

డైలీ భారత్, హైదరాబాద్‌:వనస్థలిపురం సామనగర్‌లో నారాయణ కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు కాలనీ వాసులు. హాస్టల్ విద్యార్థులు కిటికీల దగ్గర కూర్చొని పిచ్చి కూతలు, రోత చేష్టలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఇళ్లలోకి పేపర్‌ రాకెట్లు విసిరేస్తున్నారని .. లైజర్‌ లైట్లతో ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు దుస్తులు లేకుండా అసభ్యంగా తిరుగుతున్నట్లు మహిళలు చెబుతున్నారు

హాస్టల్‌ స్టూడెంట్స్‌ ఆగడాల వల్ల ఇంటి నుంచి బయటకు రావాలన్నా.. ఇంట్లో వుండాలన్నా భయం వేస్తుందని వాపోయారు మహిళలు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కాలేజీ మేనేజ్‌మెంట్‌ నుంచి కనీస స్పందన రాలేదన్నారు.

గొడవ విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. స్థానికులతో, కాలేజీ మేనేజ్‌మెంట్‌తో మాట్లాడారు. ఇక్కడి నుంచి కాలేజీ హాస్టల్‌ను షిప్ట్‌ చేయాల్సిందేనని పోలీసులకు తేల్చి చెప్పారు మహిళలు. లేదంటే ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు.

Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు

Posted On 2025-12-07 19:45:50

Readmore >
Image 1

చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి

Posted On 2025-12-07 18:39:01

Readmore >
Image 1

ఎస్ఎస్టీ చెక్ పోస్ట్ ను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్

Posted On 2025-12-07 18:35:52

Readmore >
Image 1

ఆయా దినపత్రికల స్టాపర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

Posted On 2025-12-07 17:31:39

Readmore >
Image 1

పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

Posted On 2025-12-07 17:30:34

Readmore >
Image 1

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు

Posted On 2025-12-07 14:24:59

Readmore >
Image 1

పర్యాటక రాష్ట్రం గోవాలో భారీ అగ్నిప్రమాదం

Posted On 2025-12-07 08:40:10

Readmore >
Image 1

టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత

Posted On 2025-12-06 17:39:53

Readmore >
Image 1

హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య

Posted On 2025-12-06 16:17:59

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు

Posted On 2025-12-06 16:16:40

Readmore >