Posted on 2025-02-04 01:17:00
హైడ్రా ప్రజావాణికి 71 ఫిర్యాదులు
డైలీ భారత్, తెలంగాణ డెస్క్: గేటెడ్ కమ్యూనిటీల మాదిరి కాలనీల చుట్టూ రహదారులను నిర్మించిన పక్షంలో వాటిని వెంటనే తొలగించాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశించారు.మొత్తం ఫిర్యాదుల్లో అధికభాగం పార్కులు, రహదారుల కబ్జాలే ఉన్నాయని.. లే ఔట్ ప్రకారం రహదారులుండేలా చూడాలని సూచించారు.సోమవారం హైడ్రా ప్రజావాణికి 71కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులపై అక్కడికక్కడే హైడ్రా అధికారులతో చర్చించి చర్యలకు హైడ్రా కమిషనర్ ఆదేశించారు.ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను గూగుల్ మ్యాప్స్‌ద్వరా పరిశీలించి.. దశాబ్దం క్రితం ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకున్నారు. ఫిర్యాదు దారులకు కూడా చూపించి.. సమస్య పరిష్కారానికి చర్యలు సూచించారు. ఫిర్యాదుదారులు సంప్రదించాల్సిన హైడ్రా అధికారులను పరిచయం చేసి.. వారు విచారణకు వచ్చిన సమయంలో అన్ని వివరాలు అందజేయాలని సూచించారు.ఒకప్పడు సెప్టిక్ ట్యాంకుల కోసం కేటాయించిన స్థలాలను.. ఇప్పుడు వినియోగంలో లేవని.. వాటిని ప్రజావసరాలకు కేటాయించిన స్థలంగానే పరిగణించాలని.. ఎవరైనా కబ్జాలుచేస్తే వెంటనే వాటిని తొలగించాలని కమిషనర్ అధికారులకు సూచించారు.
MP వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో రూప్లా తండాలో బిఆర్ఎస్ పార్టీ లో భారీ చేరికలు
Posted On 2026-07-26 05:15:34
Readmore >
15 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు... హైకోర్టు తీర్పును హర్షించిన డా. మద్దిశెట్టి సామేలు
Posted On 2026-07-25 16:44:33
Readmore >
హైకోర్టు న్యాయమూర్తులకు ఘన స్వాగతం పలికిన జిల్లా ఉన్నతాధికారులు
Posted On 2026-07-25 15:36:10
Readmore >
విద్యార్థుల విజయకేతానికి నాంది " కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా"
Posted On 2026-07-25 15:35:16
Readmore >
సంచలన నిర్ణయం : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా!
Posted On 2026-07-25 11:36:32
Readmore >