| Daily భారత్
Logo




కాలేజీ టాయిలెట్‌లో ప్రసవం..యూట్యూబ్‌లో చూసి బొడ్డుకోసి శిశువును చెత్తకుప్పలో పడేసిన విద్యార్థిని!

News

Posted on 2025-02-02 12:01:12

Share: Share


కాలేజీ టాయిలెట్‌లో ప్రసవం..యూట్యూబ్‌లో చూసి బొడ్డుకోసి శిశువును చెత్తకుప్పలో పడేసిన విద్యార్థిని!

డైలీ భారత్, తమిళనాడు డెస్క్: తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఘటన శుక్రవారం క్లాసు వింటుండగా విద్యార్థినికి పురిటినొప్పులు.టాయిలెట్‌కు వెళ్లి బిడ్డను ప్రసవించిన యువతి.మళ్లీ వచ్చి క్లాసులో కూర్చున్న వైనం రక్తస్రావం అవుతుండటంతో గుర్తించి ఆసుపత్రికి తరలింపు.కాలేజీ టాయిలెట్‌లో ప్రసవించిన ఓ విద్యార్థిని.. యూట్యూబ్‌లో చూసి శిశువు బొడ్డుకోసి చెత్త కుప్పలో పడేసింది. తమిళనాడులోని తంజావూర్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. కుంభకోణంలోని ప్రభుత్వ మహిళా కాలేజీలో 4 వేలమందికిపైగా అమ్మాయిలు చదువుకుంటున్నారు. వారిలో ఓ విద్యార్థిని (20) గర్భం దాల్చింది. అయితే, ఆ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది.శుక్రవారం క్లాసు వింటుండగానే ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. దీంతో టాయిలెట్‌కు వెళ్లిన ఆమె అక్కడే శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం యూట్యూబ్‌లో చూసి శిశువు బొడ్డు కోసింది. అనంతరం చెత్తకుప్పలో శిశువును పడేసి పైన చెత్త కప్పేసింది. తర్వాత ఏమీ ఎరగనట్టు తరగతి గదిలోకి వెళ్లి కూర్చుంది. అయితే, ఆమె నుంచి రక్త్రస్రావం అవుతుండటాన్ని గుర్తించిన తోటి అమ్మాయిలు విషయాన్ని లెక్చరర్ల దృష్టికి తీసుకెళ్లడంతో వారు 108 అంబులెన్స్‌ను పిలిపించి ఆసుపత్రికి తరలించారు. అక్కడ  పరిక్షించిన వైద్యులు ఆమె ప్రసవించినట్టు గుర్తించి బిడ్డ గురించి ఆరా తీశారు. అంబులెన్స్‌ను పంపి కళాశాల చెత్తకుప్పలో పడివున్న శిశువును ఆసుపత్రికి తీసుకొచ్చారు. వెంటనే చికిత్స అందించడంతో శిశువు బతికింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Image 1

అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం

Posted On 2026-07-27 18:35:56

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు

Posted On 2026-07-27 17:05:43

Readmore >
Image 1

డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్

Posted On 2026-07-27 15:43:01

Readmore >
Image 1

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించండి...

Posted On 2026-07-27 15:39:03

Readmore >
Image 1

RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం

Posted On 2026-07-27 14:31:47

Readmore >
Image 1

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-07-27 14:26:00

Readmore >
Image 1

రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం

Posted On 2026-07-27 14:24:02

Readmore >
Image 1

సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి

Posted On 2026-07-27 14:06:55

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం

Posted On 2026-07-27 08:16:22

Readmore >
Image 1

అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు

Posted On 2026-07-27 07:39:23

Readmore >