| Daily భారత్
Logo




హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటి, స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రేనే హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం

News

Posted on 2025-02-02 08:19:30

Share: Share


హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటి, స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రేనే హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం

"ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవాలి"

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటి, స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రేనే హాస్పిటల్ కరీంనగర్ సౌజన్యంతో పవర్ లూమ్ కార్మికుల కోసం ఉచిత వైద్య శిబిరం జయప్రకాష్ నగర్ లో ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ అధ్యక్షుడు రాపెల్లి లక్ష్మీనారాయణ హాజరై మాట్లాడుతూ కార్మికులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈరోజుల్లో బీపీ, షుగర్ లాంటి వ్యాధులు అందరికి వస్తున్నాయని అన్నారు. ప్రతి 3నెలలకు ఒక సారి ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలని కార్మికులకు సూచించారు.

రైనే హాస్పిటల్ డాక్టర్ ఆలయ 150 మంది కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసినారు.


ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నం చందర్ మాటాడుతూ కార్మికుల సంక్షేమం కోసం హెల్పింగ్ హార్ట్స్ నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య సంరక్షణ పట్ల జాగ్రత్తలు తెలియజేశారు.

హెల్పింగ్ హార్ట్స్ అధ్యక్షుడు అలువాల ఈశ్వర్ మాట్లాడుతూ కార్మికుల ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడం, పౌష్టికాహారం ఆవశ్యకతను కార్మికులకు తెలియజేయడం కోసం ప్రతి వీధిలో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సైకాలజిస్ట్ కె.పున్నం చందర్, హెల్పింగ్ హార్ట్స్ అధ్యక్షుడు అలువాల ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ దాసరి తిరుమల,మాజీ ఎంపీటీసీ బుర్ర మల్లిఖార్జున్, ఆడేపు చంద్రకళ, వంతడ్పుల రాము, వేముల దామోదర్, గుర్రం శంకర్, అవధూత శ్రీహరి, చిందం సాయికుమార్, అభి, మాదాసు గంగారం హాస్పిటల్ స్టాఫ్ మరియు కార్మికులు పాల్గొన్నారు.

Image 1

అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం

Posted On 2026-07-27 18:35:56

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు

Posted On 2026-07-27 17:05:43

Readmore >
Image 1

డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్

Posted On 2026-07-27 15:43:01

Readmore >
Image 1

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించండి...

Posted On 2026-07-27 15:39:03

Readmore >
Image 1

RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం

Posted On 2026-07-27 14:31:47

Readmore >
Image 1

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-07-27 14:26:00

Readmore >
Image 1

రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం

Posted On 2026-07-27 14:24:02

Readmore >
Image 1

సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి

Posted On 2026-07-27 14:06:55

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం

Posted On 2026-07-27 08:16:22

Readmore >
Image 1

అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు

Posted On 2026-07-27 07:39:23

Readmore >