| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నేతన్నల కోసం త్వరలో కొత్త పథకం ప్రారంభం!

నేతన్నల కోసం త్వరలో కొత్త పథకం ప్రారంభం!

డైలీ భారత్, తెలంగాణ : నేత కార్మికులు స్వయం సమృద్ధిని సాధిస్తూ యజమానులుగా మారేందుకు రూ.386.88 కోట్లతో పథకం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 

తొలివిడతలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,104 మందికి దీని ద్వారా లబ్ధి కలగనుంది. FEB నెలాఖరు లేదా ఉగాది నాడు దీన్ని ప్రారంభించే ఛాన్స్ ఉంది. 

ఒక్కో లబ్ధిదారుకు రూ.16.52 లక్షల మేర సాయం అందుతుంది. ఇందులో రూ.8.26 లక్షలు (50 శాతం) ప్రభుత్వ సబ్సిడీ కాగా రూ.1,65,220 (10 శాతం) లబ్ధిదారు వాటాగా చెల్లించాలి. 

మిగతా 40 శాతం బ్యాంకుల నుంచి రుణంగా ఇప్పిస్తారు.

Previous తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ మృతి
Next ప్రారంభమైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
ADVERTISEMENT