| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఇందిరమ్మ రాజ్యంతోనే కష్టాలు తీరుతాయి : వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, మొహమ్మద్ ఇబ్రహీం

ఇందిరమ్మ రాజ్యంతోనే కష్టాలు తీరుతాయి : వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, మొహమ్మద్ ఇబ్రహీం


కేశంపేట మండలం పోమాలపల్లి లో నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించిన అధికారులు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఇందిరమ్మ రాజ్యంలోనే కష్టాలు తీరుతాయని కాంగ్రెస్ పార్టీని గెలిపించారని షాద్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొహమ్మద్ ఇబ్రహీం అన్నారు.. 75 ఏళ్లు గణతంత్ర దినోత్సవం పూర్తయిన సందర్భంగా పవిత్రమైన ఈ రోజు నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభించుకున్నామని ఆయన అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం పోమాల్ పల్లి గ్రామంలో ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రూ. 2కొట్ల 15 లక్షల రూపాయలతో లబ్ధిదారులకు మంజూరి పత్రాలు అందజేశారు. అదేవిధంగా 80 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు,  రేషన్ కార్డులు 92, మరో ఐదు మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఉత్తర్వులను జారీ చేసినట్లు వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ..

రైతు రుణమాఫీ రూ. 21 వేల కోట్లు మాఫీ చేశామన్నారు.

రైతు భరోసాలో ఎకరాకు రూ. 12 వేలు సాయం అందజేస్తున్నామని అన్నారు. ఇక త్వరలోనే రైతు అకౌంట్స్‌లో రైతు భరోసా నిధులు జమ చేస్తున్నామని తెలిపారు. ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు. గుడిసెలు లేకుండా పక్కా ఇళ్లు నిర్మిస్తున్నామన్నామని చెప్పుకొచ్చారు. సొంత స్థలంలో ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు, రైతు కూలీలకు ఏడాదికి 12 వేలు సాయం అందజేస్తామని తెలిపారు. లక్షన్నర లోపు ఆదాయం ఉన్న వారికి రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మార్చి 31 నాటికి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు , రేషన్ కార్డులు నాలుగు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని బాబర్ ఖాన్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ ఏడి రాజారత్నం, అధికారులు శిరీష, అజీజ్ అహ్మద్, ఆజం అలీ, కాంగ్రెస్ నాయకులు జగదీశప్ప, వీరేశం, శ్రీధర్ రెడ్డి, కృష్ణయ్య, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Previous డిబివి అసోసియేషన్ అధ్యక్షులు వీర్నాల సత్యనారాయణ కి అభినందనల వెల్లువ
Next రైల్వే శాఖ చీఫ్ ఫార్మాసిస్ట్ నేత్రదానం
ADVERTISEMENT