సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయం
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు, డైలీ భారత్:సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
పటాన్చెరు మండల పరిధిలోని ఇస్నాపూర్ గ్రామంలో మేరా ఇండియా సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్మెట్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, డెలివరీ బాయ్స్ కి హెల్మెట్లు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రయాణ సమయంలో ద్విచక్ర వాహనదారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒక చిన్న నిర్లక్ష్యం కుటుంబాన్ని రోడ్డుపాలు చేస్తుందని అన్నారు. ప్రతి సంవత్సరం జరుగుతున్న ద్విచక్ర వాహనం ప్రమాదాల్లో 87 శాతం మంది హెల్మెట్ ధరించకపోవడం మూలంగా చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేరా ఇండియా సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. సమాజ హితం కోసం స్వచ్చంద సంస్థలు పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు సీఐ వినాయక్ రెడ్డి, ఇస్నాపూర్ మాజీ సర్పంచ్ లు వెంకట్ రెడ్డి, బాలమని శ్రీశైలం, మల్లారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ శోభ కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు మెరాజ్ ఖాన్, రామకృష్ణ, సంస్థ నిర్వాహకులు మహమ్మద్ తన్వీర్, షేక్ ఆరిఫ్, సలీముద్దీన్, ముబీన్ ఖాన్, అబేద్, తదితరులు పాల్గొన్నారు.