నియామక పత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
పార్టీ అభివృద్ధి కోసం, కార్యకర్తల అభ్యున్నతి కోసం కృషి చేస్తా
షాద్ నగర్ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎర్రోళ్ల జగన్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు ఎర్రోళ్ల జగన్ నూతనంగా ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆయనకు నియామక పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎర్రోళ్ల జగన్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఎస్సీ సెల్ అధ్యక్షునిగా నియమించినందుకు పీసీసీ మహేష్ గౌడ్ కి, రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ప్రీతంకి, అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు తన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.తాను పార్టీ అభివృద్ధి కోసం, కార్యకర్తల అభ్యున్నతి కోసం నిరంతరం అందుబాటులో ఉంటానని, పార్టీ ప్రతిష్టను పెంచడానికి కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.