| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

"రోడ్డు భద్రత మనందరి బాధ్యత : సుజాతనగర్ ఎస్సై రమాదేవి

"రోడ్డు భద్రత మనందరి బాధ్యత : సుజాతనగర్ ఎస్సై రమాదేవి


హెల్మెట్ ధరించు ప్రాణాలు కాపాడుకోవాలి సుజాతనగర్ ఎస్సై రమాదేవి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ ఎస్సై  రమాదేవి  సిబ్బంది తో కలిసి ధన్వంతరి కాలేజ్ ఫార్మసీ స్టూడెంట్స్ తో  వినూత్నంగా ధన్వంతరి కాలేజ్ నుంచి సుజాతనగర్ సెంటర్ వరకు రూట్ మార్చ్ నిర్వహిస్తూ  వాహనదారులకు యువకులకు ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనల గురించి అవగాహన కల్పించారు. ప్రతివాహనదారుడు నిబంధనలను పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, త్రిబుల్ రైడింగ్ చేయవద్దని, మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరమని, వాహనం నడిపేటప్పుడు వాహనo కు సంబంధించిన డాక్యుమెంట్స్  డ్రైవింగ్ లైసెన్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని అవగాహన కల్పించడo జరిగింది.సుజాతనగర్ సెంటర్లో స్టూడెంట్స్ తో కలిసి మానవహారం నిర్వహించి ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించడం జరిగింది.

కావున రోడ్డుమీద నడిచేవారు మరియు వాహనదారులందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని కోరనైనది. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Previous ఏసీబీ అధికారులకు చిక్కిన అప్పటి స్టేషన్ అధికారి
Next అందరివాడు ఆత్మీయుడు శభాష్ పోలీస్ ఆఫీసర్ బదిలీ
ADVERTISEMENT