కమలాపూర్ లో తీవ్ర ఉద్రిక్తత
హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డిపై దాడి జరిగింది. ఆయనపై టమాటాలతో దాడికి పాల్పడ్డారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డిపై దాడి జరిగింది. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డిపై టమాటాలతో దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్ నాయకులు కుర్చీలు విసిరేశారు. పోటాపోటీగా ఇరువర్గాల నినాదాలతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకొని బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరువర్గాలకు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ ఘటన హన్మకొండ జిల్లా కమలాపూర్ గ్రామసభలో చోటు చేసుకుంది.
గ్రామ సభకు హాజరైన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల లిస్ట్ పై అధికారులను ప్రశ్నించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే పై ఫైర్ అయ్యారు. పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డిపై టమాటాలు విసిరారు. ఆ వెంటనే బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలపై కుర్చీలు విసిరారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను అడ్డుకున్నారు