డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా :బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షులు గౌరవరాజుల వెంకటేశ్వర రావు అన్నారు.బుదవారం షాద్ నగర్ లోని రామ్ మందిర్ నందు బ్రాహ్మణ సంక్షేమ సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ అధ్యక్షులు గౌరవరాజుల వెంకటేశ్వర రావు సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘం లక్ష్యసాధనలో ముందుండాలని ఆకాంక్షించారు. అందుకు అవసరమైన సంపూర్ణ సహకారం అందిస్తామని హామీఇచ్చారు. ప్రస్తుత తరుణంలో బ్రాహ్మణ సంక్షేమ సంఘం దేశవ్యాప్తంగా పనిచేయవలసిన ఆవశ్యకత ఉందన్నారు. బ్రాహ్మణుల ఐక్యత, సంక్షేమం కోసం సంఘం జాతీయస్థాయిలో పనిచేయాలని కోరారు. న్యాయబద్ధంగా పరిష్కారం కావలసిన సమస్యల పరిష్కారానికై కృషి చేయాలన్నారు. అనంతరం కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలను అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు రామసత్యనారాయణ శర్మ ,ప్రధాన కార్యదర్శి వాసుధర్,కోశాధికారి వేణు గోపాల్, శిరీష,ఆండాళ్, కమల్ కిషోర్,రాదేశ్యామ్,సుజీవన్, టౌన్ అధ్యక్షులు గౌరవరజుల మణిపంతులు తదితరులు పాల్గొన్నారు.
News
బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తా : గౌరవరాజుల వెంకటేశ్వర రావు