| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయి వరకు క్రీడాకారులు ఎదగాలి : ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయి వరకు క్రీడాకారులు ఎదగాలి : ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా:ఫరూక్ నగర్ మండలం కొంగగూడలో క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ముగిసాయి. టోర్నమెంట్ ముగింపులో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి శుభ సందర్భాన్ని పురస్కరించుకొని గ్రామీణ ప్రాంతాల్లో    క్రీడల పై ఆసక్తి పెరిగిందని, ఇది ఇలాగే కొనసాగాలని క్రీడాకారులందరూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి  గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ఎదిగి  ఆయా గ్రామాల పేర్లు నిలబెట్టాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో గెలిచిన జట్లు విన్నర్ టీం ఆర్సిబి, రన్నర్ టీం గుజరాత్లకు  బహుమతులు అందజేసి క్రీడాకారులను అభినందించారు. క్రీడల వలన శారీరక శ్రమ పెరిగి  మానసిక ఉల్లాసాన్ని కలిగిన వారు అవుతారని, శారీరక దారుఢ్యం పెరిగి  ఇలాంటి పరిస్థితి నైనా ఎదుర్కొని తట్టుకొని నిలబడగలిగే సామర్థ్యం పొందిన వారవుతారని, మానసికంగా ఆరోగ్యంగా చురుకుగా  చురుకుగా తయారవుతారని,  క్రీడల వలన సామాజిక సాన్నిహిత్యం పెరుగుతుందని, సామాజిక బాధ్యత తెలిసి సమాజంలో మంచి పౌరులుగా ఎదుగుతారని  తద్వారా కుటుంబాభివృద్దితోపాటు, సమాజాభివృద్ధి జరుగుతుందని  అన్నారు.  దయచేసి యువత ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ లలో పాల్గొని  తమ జీవితాలు నాశనం చేసుకొని  కుటుంబ పరువు తీయొద్దని  నవ సమాజ నిర్మాణంలో యువత తమ వంతు పాత్ర పోషించి తమ కుటుంబం యొక్క పేరు నిలబెట్టి సామాజిక స్పృహతో ఉండి  సమాజ అభివృద్ధికి పాటుపడి  పదిమందికి సేవ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మెకగూడ మాజీ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, వెంకన్న గూడా మాజీ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, ఇన్ముల్ నర్వ మాజీ సర్పంచ్ అజయ్ నాయక్, బిఆర్ఎస్ పాపయ్య యాదవ్, రవి నాయక్, పాండు నాయక్, శివ చారి, రాజు నాయక్, నాయక్, వేణు రఘు, రమేష్, శ్రీను లో,క్రీడా కారులు తదితరులు పాల్గొన్నారు.


*గంతల నాగరాజు రిపోర్టర్*

Previous దక్షిణ మధ్య రైల్వేలో ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ గా బాధ్యతలు స్వీకరించిన కె. పద్మజ
Next తెలంగాణలో ఒకేసారి నాలుగు పథకాలు అమలు
ADVERTISEMENT