2005-2006 పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : పూర్వ విద్యార్థుల అపూర్వ కలయికకు ఉడిత్యాల గ్రామం వేదికైంది బాలానగర్ మండలం ఉడిత్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2005-2006 పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఒకరికి ఒకరు పరిచయం చేసుకుంటూ ఆప్యాయంగా పలకరించుకుంటూ సరదాగా గడిపారు. అప్పుడు బెత్తంతో కొట్టిన టీచర్లతో మళ్ళీ కొట్టించుకున్నారు. వారి ఆనందానికి అవధులు లేవు విద్యార్థుల ఎంత పెద్ద ఎత్తు ఎదిగిన ఉపాధ్యాయుల దగ్గరికి రాగానే వాళ్ల స్థాయిని మరిచిపోయి చిన్నపిల్లల వాళ్ళ దగ్గర వాలిపోయారు .మధుర తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు పాఠశాలలో గడిపిన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. పాఠశాలలో చదువు చెప్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి వారికి జ్ఞాపికలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గోపాల్ రావు,మల్లేష్, ప్రవీణ్, శ్రీకాంత్,శ్రీను,ముత్యాలు,రాఘవేందర్ విజయకుమారి,మాజీ ఉప సర్పంచ్ భాను గౌడ్, పిజి లింగం,శ్రీశైలం,రాజు,నరేష్,విష్ణు,కృష్ణయ్య,ప్రశాంత్,మహేష్,పాండు,శ్రీను,మాధవి,రాజేశ్వరి,లక్ష్మి,శ్రీలత మరియు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.