మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద రంజిత్ కుమార్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణలో అతి త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని పార్టీలు యువతకు వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపిటిసి, జెడ్పిటిసిలుగా అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. రాజకీయాల్లో యువత పాత్ర కీలకంగా మారిందని అన్ని పార్టీల జెండాలను, అజెండాలను యువత తమ భుజస్కందాలపై మోసి ప్రజలవద్దకు తీసుకెళ్తున్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పధకాలను ప్రజలకు చేరవేయడంలో యువత పాత్ర కీలకమని అన్నారు. ఆధునిక యుగంలో సోషల్ మీడియా ద్వారా అన్ని పార్టీల కార్యకలాపాలను ప్రజల వద్దకు చేర్చడంలో యువత పాత్ర కీలకమని భవిష్యతులో బలమైన నాయకత్వాన్ని దేశానికి అందించడానికి రాజకీయాల్లో యువతకు ప్రాధాన్యత అధికంగా ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. చదువుకున్న యువతరం రాజకీయాల్లోకి రావడం వల్ల అనేక రాజకీయ సామాజిక అంశాలపై ప్రజలకు సరైన అవగాహన కల్పించే అవకాశం ఉంటుందని మంద రంజిత్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.