డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: సంక్రాంతి పండుగ సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తెలుగు ప్రజలందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.భోగి, మకర సంక్రాంతి,కనుమ పండుగల సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాసులు,దేశంలోని వివిధ రాష్ట్రాలు,విదేశాలలో స్థిరపడిన, నివసిస్తున్న తెలుగు వారందరికి ఎంపీ రవిచంద్ర హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు.భోగి మంటలు వేసేటప్పుడు,పతంగులు ఎగరేసే సందర్భాలలో ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఒక ప్రకటనలో ఎంపీ రవిచంద్ర యువతకు హితవు పలికారు.కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సంక్రాంతి సంబురాలను ప్రశాంతంగా జరుపుకోవలసిందిగా ఎంపీ వద్దిరాజు తెలుగు వారందరిని కోరారు.
News
సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ వద్దిరాజు