షాద్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం.. ప్రయాణికులతో వెళుతున్న బస్సు బోల్తా..
డైలీ భారత్, రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నేషనల్ హైవే 44 పై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ఇటువైపున ఉన్న రోడ్డుపై బోల్తా పడింది..
బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై బస్సు పడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.10 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికి నిలిచిపోయాయి. బస్సును క్లియర్ చేసేందుకు అధికారుల యత్నిస్తున్నారు..