| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కాంగ్రెస్ 6 గ్యారంటీల పేరుతో మోసం : బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి లకావత్ గిరిబాబు

కాంగ్రెస్ 6 గ్యారంటీల పేరుతో మోసం : బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి లకావత్ గిరిబాబు

రైతుబంధు రూ.15 వేలు అని రూ.12 వేలకు తగ్గింపు

బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి లకావత్ గిరిబాబు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:కాంగ్రెస్ 6 గ్యారంటీల పేరుతో మోసం రైతుబంధు రూ.15 వేలు అని రూ.12 వేలకు తగ్గింపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిన రైతులకు రైతుబంధు అందించని దుస్థితిలో కాంగ్రెస్ ఉన్నదని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వైరా నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు తెలిపారు. కాంగ్రెస్ మాయ మాటలు చెబుతూ ప్రజలను మభ్యపెట్టే దిశగా వెళుతుంది. తప్ప ప్రజలకు మేలు చేసే పనులు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రైతులకు రైతుబంధు ఎకరాకు రూ.15 ఇస్తామని చెప్పి సంవత్సరం గడిచిన రైతుబంధు ఇవ్వలేదని, రైతులు పంట సాయం కోసం ఎదురుచూసి నిరాశే మిగిలిందన్నారు. ఎన్నికలో ఇచ్చిన హామీ ప్రకారం రైతు బంధు రూ.15 వేలు 15 వేలు ఇయ్యలేమని, రూ.12 వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం సరైనది కాదన్నారు. రైతుబందుకు కాంగ్రెస్ ఒక సంవత్సరం ఎగ్గొట్టిందని దానిని కలిపి రైతుల ఖాతాలో జమ చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు

Previous రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స.. కీలక పథకాన్ని ప్రకటించిన కేంద్ర మంత్రి
Next మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ADVERTISEMENT