డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎస్సై మేడాప్రసాద్ నమ్మదగిన సమాచారం మేరకు సమితి సింగారం గ్రామంలోబెల్ట్ షాపులో గంజాయి అమ్ముతున్నారని సమాచారంతో పోలీస్ సిబ్బంది ఆగు షమీం, రవీందర్, కన్నారావు ఉమెన్ పీసీ పద్మ కలిసి పై జిల్లా అధికారుల ఉత్తర్వుల మేరకు సమితిసింగారం గ్రామంలో ఉన్న స్వరూప అనే ఒక మహిళ బెల్ షాప్ దగ్గరికి వెళ్లి తనిఖీ చేయగా అక్కడ సుమారు రెండు కేజీల గంజాయి దొరికింది. ఇట్టి గంజాయినీ ముగ్గురు వ్యక్తులు నిషేధిత గంజాయి సరూప అభి రమేష్ మరియు వాసి మక్రం నలుగురు కలిసి వాసిం అక్రమ యొక్క ఆటోలో వాసిం అక్రమ్ ఒరిస్సా రాష్ట్రం చిత్రకొండ ప్రాంతానికి చెందిన అతనికి పరిచయం ఉన్న ఉన్న నగేష్ అనే వ్యక్తి వద్దకు వెళ్లి అక్కడ నుండి అతని వద్ద నుండి 5800/- రూపాయలకు కొనుగోలు చేసి మణుగూరు కి తీసుకువచ్చి ఇక్కడ స్వరూపా తన బెల్ట్ షాప్ వద్ద వచ్చే వ్యక్తులకు అదే విధంగా కాలేజీ దగ్గర గాని మరియు ఇతర ప్రాంతంలో వ్యక్తులకు చిన్నచిన్న ప్యాకెట్లుగా చుట్టి గంజాయి అమ్ముతారు.
కేసులో అభి మరియు చిత్రకొండకు చెందిన నగేష్ అనే వ్యక్తి పరారి లో ఉన్నాడు . పైన పేర్కొన్న ముగ్గురు వ్యక్తుల కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్ పంపించడం జరిగింది.