డైలీ భారత్, శ్రీకాకుళం: డిసెంబర్ 3, 4 తేదీలలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఆమదాలవలస స్టేషన్ మాస్టర్ కార్యాలయం నుంచి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
పలాస-విశాఖపట్నం, సికింద్రాబాద్-భువనేశ్వర్,
హౌరా-చెన్నై, హౌరా-వాస్కోడిగామా తదితర రైళ్లను రద్దు
చేస్తున్నట్లు వాల్తేరు రైల్వే డివిజన్ నుంచి ఉత్తర్వులు
వచ్చాయన్నారు. రైల్వే ట్రాక్లో పలుచోట్ల వంతెనల
పునర్నిర్మాణ పనులు చేపడుతున్నందున జిల్లా మీదుగా
నడిచే రైళ్లు రద్దు చేశారు.