డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా :నూతన సంవత్సరం సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకు ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.బుదవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌కు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.అలాగే కేటీఆర్ కూడా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సత్కారానికి సంతోషించి ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరము కేటీఆర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ద్వారా తయారు చేయించబడిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల తారక రామారావు నూతన సంవత్సరం తెలంగాణ ప్రజల్లో సుఖ సంతోషాలను నింపాలని, రాష్ట్ర ప్రజలందరూ నూతన సంవత్సరంలో క్షేమంగా ఉండాలని కోరుకున్నారు.
News
కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి