| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పెద్దనాగారం ZPHS పాఠశాల విద్యార్థుల విశేష ప్రతిభ

పెద్దనాగారం ZPHS పాఠశాల విద్యార్థుల విశేష ప్రతిభ

డైలీ భారత్, పెద్దనాగారం: మండల స్థాయి సాంఘిక శాస్త్ర ప్రతిభ పోటీలలో ZPHS పెద్దనాగారం పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరచి ప్రతిష్టాత్మక స్థానాలు సంపాదించారు. పోటీల్లో అజ్మీరా భరత్ ప్రథమ స్థానం మరియు పోడేటి సాత్విక ద్వితీయ స్థానం సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు.

విద్యార్థుల విజయానికి పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు D. సికిందర్, స్టాప్ సెక్రటరీ B. లచ్చు, ఉపాధ్యాయ బృందం B. నాగేష్,  K.నరసింహారెడ్డి, N. వెంకటేశ్వర్లు, S. బాల వేణు అభినందనలు తెలిపారు.

విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఈ విజయానికి కారణమని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో కూడా మరిన్ని విజయాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

Previous రూ. 1.60 లక్షల గోవా మద్యం పట్టివేత..కారు సీస్, నలుగురు వ్యక్తుల అరెస్ట్
Next నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన జూలూరుపాడు ఎస్ఐ బాదావత్తు రవి
ADVERTISEMENT