Posted on 2023-08-29 15:36:54
హైదరాబాద్: నగరంలోని ఘట్‌కేసర్‌లో చైన్ స్నాచర్ హల్‌చల్ చేశాడు. ఓ మహిళ కంట్లో కారం కొట్టి ఆమె మెడలోన్ని మంగళసూత్రాన్ని దొంగలించాడు.
ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివారెడ్డి గూడ చౌరస్తాలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. మూడున్నర తులాల బంగారం చైన్‌ను దొంగ అపహరించాడు. బాధితురాలు కల్వకుంట్ల మంజుల (52) ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా హన్మకొండలో విధులు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో శివారెడ్డి గూడ చౌరస్తాలో బస్ స్టాండ్‌లో బస్ కోసం మంజుల ఎదురు చూస్తున్నారు. అక్కడకు వచ్చిన ఓ దొంగ.. కంట్లో కారం కొట్టి మంగళ సూత్రం దొంగలించి పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి పరారయ్యాడని బాధితురాలు తెలిపారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు...
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >