| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

యువత చట్టాల పై అవగాహన కలిగి ఉండాలి : తుడుం దెబ్బ జిల్లా నాయకులు తంబళ్ల రవి

యువత చట్టాల పై అవగాహన కలిగి ఉండాలి : తుడుం దెబ్బ జిల్లా నాయకులు తంబళ్ల రవి

తుడుం దెబ్బ జిల్లా నాయకులు తంబళ్ల రవి

సెక్షన్ 43,(8) ప్రకారం గ్రామపంచాయతీ ప్రభుత్వ ఉద్యోగులు ఏ గ్రామాలలో విధులు నిర్వహిస్తున్నారో ఆ గ్రామాలలో స్థానికంగా నివాసం ఉండాలి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తుడుం దెబ్బ జిల్లా నాయకులు తంబళ్ల రవి మాట్లాడుతూ గ్రామాల్లో ఉండే యువత మేలుకోండి తెలంగాణ రాష్ట్రం పంచాయతీరాజ్ చట్టంలో సెక్షన్ 43.(8) ప్రకారం గ్రామపంచాయతీలకు సంబంధించిన సెక్రటరీలు,కామటి,కారో బర్లు,వీరితో పాటు వివిధ గ్రామాలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా గాని ఏ ఏ గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్నారో ఆ యొక్క గ్రామాల్లో స్థానికంగా నివాసం ఉంటూ ఆ గ్రామాల్లో ఉన్న ప్రజల సమస్యలు అధికారకంగా పరిష్కరించాలని,ఆ గ్రామంలో పంచాయతీ సెక్రటరీ గాని ఇతర ప్రభుత్వానికి అనుసంధానం గల ప్రభుత్వ ఉద్యోగులు గాని నివాసం ఉంటున్నారా లేదా అని యువత మరియు ప్రజలు మేల్కోండి అంటూ ప్రజలకు సూచన ఇచ్చారు, ఇప్పటికైనా ఆయా గ్రామస్తులు అందరూ ఏకమై కార్యదర్శులునే కాక ప్రభుత్వ ఉద్యోగుల్ని కూడా ప్రశ్నించడం మొదలు పెట్టాలి,భారతదేశ పౌరులుగా చట్టాల గురించి తెలుసుకోండని,మీ గ్రామాలలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ యంత్రాంగంపై ప్రశ్నిస్తూ ఉండాలని ఒక ప్రకటనలో తెలిపారు.

Previous దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ వద్దిరాజు, కే.ఆర్.దీవకొండల
Next ఏసీబీ కంటే ముందు ఈడీనే కేటీఆర్‌కు నోటీసులు
ADVERTISEMENT