| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎస్ వి రెస్టారెంట్ దాబాను ప్రారంభించిన జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

ఎస్ వి రెస్టారెంట్ దాబాను ప్రారంభించిన జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా :షాబాద్ మండలం మద్దూర్ చౌరస్తాలో రఘు,శివ స్నేహితుల కలిసి నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్.వి రెస్టారెంట్ దాబాను ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన రంగారెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి,చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదిగేందుకు మిత్రులు కలిసి హోటల్  వ్యాపారంను ప్రారంభించడం అభినందనీయమని కొనియాడారు. మానవుని ఆరోగ్యాన్ని పరిరక్షించే విధంగా వంటకాలను వడ్డించాలని, నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ, వినియోదారుల మెప్పును పొందాలని సూచించారు.ప్రజలకు నాణ్యమైన భోజనాలను అందించాలని ఆరోగ్యమే మహాభాగ్యం అని ప్రతి మనిషి ఎంత కష్టపడ్డ బుక్కెడు తిండి కోసం ఉంటాడని, అందుకే మంచి భోజనాలను అందించాలని అదేవిధంగా ప్రజలకు అందుబాటులో సరసమైన ధరలకు ఇవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సర్దార్ నగర మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి,షాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కావలి చంద్రశేఖర్,మాజీ ఎంపీటీసీలు కుమ్మరి చెన్నయ్య, అశోక్ ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు దండు రాహుల్ గుప్త,తమ్మలి రవీందర్,రవీందర్ రెడ్డి,అక్తర్ పాషా,గంధం గౌరీశ్వర్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Previous వేం నరేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
Next పాపకొల్లు గ్రామంలో వంగవీటి మోహన్ రంగా 36వ వర్ధంతి వేడుకలు
ADVERTISEMENT