డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఫరుక్ నగర్ మండలం లో ఎలికట్ట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని ఆర్వో వాటర్ ప్లాంట్ యజమాని రవి సాదరంగా ఆహ్వానించి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో బెంది శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ సాయి యాదవ్, మాజీ సర్పంచ్ యాదయ్య, కంటెస్టెడ్ యంపిటిసి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు రామస్వామి మరియు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఆరో వాటర్ ప్లాంట్ యజమాని రవికి శాలువ కప్పి శుభాకాంక్షలు తెలియజేసి, వ్యాపారం బాగా అభివృద్ధి జరిగి ఆర్థికంగా ముందుకు సాగాలని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఆకాంక్షించారు.