| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు

శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు

డైలీ భారత్, శబరిమల: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం 22 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం 22 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. సికింద్రాబాద్-కొల్లం ఈ నెల 26, డిసెంబరు 3వ తేదీల్లో; కొల్లం-సికింద్రాబాద్ ఈ నెల 28, డిసెంబరు 5; నర్సాపూర్-కొట్టాయం ఈ నెల 26, డిసెంబరు 3; కొట్టాయం-నర్సాపూర్ ఈ నెల 27, డిసెంబరు 4; కాచిగూడ-కొల్లం ఈ నెల 9 22, 29 డిసెంబరు 6; కొల్లం-కాచిగూడ ఈ నెల 24, డిసెంబరు 1, 8; కాకినాడ-కొట్టాయం ఈ నెల 23, 30; కొట్టాయం-కాకినాడ ఈ నెల 25, డిసెంబరు 2; సికింద్రాబాద్-కొల్లం ఈ నెల 24, డిసెంబరు 1; కొల్లం-సికింద్రాబాద్ ఈ నెల 25, డిసెంబరు 2 తేదీల్లో ప్రత్యేక రైళ్లు ఉంటాయి. వీటిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏసీ బోగీలతో పాటు స్లీపర్, జనరల్ కోచ్లు ఉంటాయి.

Previous ఆ రోజు రాత్రి....ఎమైంది
Next ఇంద్ర బస్సు కు ప్రమాదం.. ప్రయాణికులు క్షేమం
ADVERTISEMENT