| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

క్రీడల్లో గెలుపు ఓటములు సహజం:జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

క్రీడల్లో గెలుపు ఓటములు సహజం:జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని, ఓటమి చెందిన క్రీడాకారులు నిరుత్సాహానికి గురికాకుండా గెలుపొందేందుకు కృషి చేయాలని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు.రంగారెడ్డి శంకరపల్లి మండలం మోకిలాలోని తెలంగాణ క్రీడ ప్రాంగణంలో సీఎం కప్ క్రీడాల్లో ముగింపు సందర్భంగా గురువారం విజేతలకు బహుమతులు అందజేసిన జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి,ఎమ్మెల్యే కాలే యాదయ్య.ఈ సంధర్భంగా వారు మాట్లాడుతు క్రీడలు విద్యార్థుల మానసిక వికాసానికి ఎంతో దోహదపడతాయని అన్నారు. గత వారం రోజుల పాటు నిర్వహించిన క్రీడా బాల, బాలికలు వారి ప్రతిభను చాటుకున్నారని పేర్కొన్నారు. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. వివిధ విభాగాల్లో నిర్వహించి న పోటీల్లో గెలుపొందిన ప్రథమ, ద్వితీయ, తృతీయ టీంలకు షీల్డ్‌, మెమోంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ సీనియర్ నాయకులు షాబాద్ దర్శన్ , వేణుగోపాల్ ,లక్ష్మణ్,మహేందర్ ముదిరాజ్, రామ్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, రాఘవరెడ్డి, రాజు గౌడ్, ప్రవీణ్, విద్యార్థులు,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Previous అంబేద్కర్ యూనివర్శిటీ ఉప కులపతి గంటా చక్రపాణికీ అభినందన వెల్లువ
Next గృహప్రవేశానికి హాజరైన మాజీమంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ రవీందర్ యాదవ్
ADVERTISEMENT