డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కొత్తూరు మండలం తీగపూర్ గ్రామంలో శ్రీ సీతారామచంద్ర పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమనికి హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలను చేశారు. అనంతరం ఆలయ నిర్వహకులు ఎమ్మెల్యే శంకర్ ను సన్మానించారు.
అనంతరం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ..
"శ్రీరామాయణం" ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా కొత్తగా అనిపిస్తుందనీ మానవుల జీవితానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన అవతారం శ్రీరామావతారం అని పేర్కొన్నారు. రాముడు పరిపూర్ణమైన మానవుడిగా ప్రవర్తించాడనీ ఈ ప్రపంచంలో మంచి గుణములు కలిగిన మానవుడు ఎవరు అని నారద మహర్షిని వాల్మీకి మహర్షి ప్రశ్న వేసినప్పుడు "పదహారు గుణములు కలిగిన పరిపూర్ణమైన మానవుడు రామచంద్రమూర్తి" అని నిర్ధారించారని వివరించారు. మనుష్య జీవితంతో శ్రీరాముడి జీవితం మమేకమైపోయిందనీ ఆయన మానవుడిగా పుట్టాడు.. మానవుడిగా పెరిగాడు.. మానవుడు పడిన కష్టాలను పడ్డాడు. మానవుడిగానే అవతారం పరిసమాప్తి చేశాడన్నారు. శుశ్రూషలతో గురువులను, దాన గుణముతో దీనులను ఆయన సత్యముతో లోకాలను, ధర్మంతో సమస్తాన్ని అద్భుతంగా పాలించారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు హరినాథ్ రెడ్డి, కొత్తూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ, కృష్ణయ్య, జగన్మోహన్ రెడ్డి, తీగాపూర్ ఆంజనేయులు, నరేష్, యదయ్య, వెంకటేష్ ,శివ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..