డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: స్వామియే శరణం అయ్యప్ప శరణం.. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప అంటూ దిక్కులు పెక్కటిల్లేటట్టు అయ్యప్ప భక్తులకు అన్నప్రసాదాన్ని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అందజేశారు. పట్టణ శివారులోని చౌడమ్మ గుట్ట హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో అయ్యప్ప భక్తులకు అన్న వితరణ చేశారు. భక్తిశ్రద్ధలతో అయ్యప్పకు ప్రత్యేక పూజలు చేసి స్వామి భక్తులకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంతో నియమనిష్ఠలతో స్వామి మాల వేసుకుని కఠినమైన దీక్ష చేపట్టిన స్వాములకు అన్న వితరణ చేయడం ఎన్నో జన్మల పుణ్యమని అన్నారు. అయ్యప్పను నమ్మినవారు ఎన్నటికీ చెడిపోరని అయ్యప్ప మాల ధరించడంతో సర్వ దరిద్రాలు పటాపంచలు అవుతాయని అన్నారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి అభిమాని నాగరాజు స్వామి మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డిని సన్మానించారు. స్వాములకు అన్న విధాన కార్యక్రమం చేపట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ప్రకాష్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నేత కృష్ణారెడ్డి, కొత్తూరు నందిగామ ఉమ్మడి మండలాల మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, రాజు, విజయకుమార్ రెడ్డి, కృష్ణారెడ్డి, అప్పారెడ్డి గూడ వెంకట్, రైతు కాలనీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి శుక్రవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..