డైలీ భారత్, ఖమ్మం: బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు నేడు ఖమ్మం నగరంలోని NTR సర్కిల్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి ఖమ్మం నగర BRS నాయకులతో కలిసి పాలాభిషేకం నిర్వహించిన నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు..
ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రజల తలరాతలు మారాలి కానీ తల్లుల విగ్రహాలు కాదు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశించి తీవ్రంగా మండిపడిన ఖమ్మం నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు
ఈ సందర్భంగా వార మాట్లాడుతూ ....
తెలంగాణ తల్లి అంటే కేవలం విగ్రహం కాదు, తెలంగాణ తల్లి మన ఉద్యమాల కేతనం ,మన స్వాభిమాన సంకేతం, తెలంగాణ తల్లి మన అస్తిత్వ ప్రతీక, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం అంటే తెలంగాణ స్ఫూర్తిని అవమానించడమే, తెలంగాణ ఆత్మగౌరవంగా నిలిచి స్వరాష్ట్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన తెలంగాణ తల్లిని గౌరవించుకునేందుకు నేడు ఖమ్మం నియోజకవర్గం తెలంగాణ తల్లి సర్కిల్ నందు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది , కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పేది ఒక్కటే, ఈ మట్టి నిలుపుకున్న సాంస్కృతిక చిహ్నాలను మార్చే చేష్టలను ఎంత మాత్రం అంగీకరించేది లేదు, రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడి సాధించిన నేల ఇది, సంస్కృతి ఆత్మగౌరవాల కోసం మరోసారి ఉద్యమించేందుకు కూడా సిద్ధం,
మన తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను తెలంగాణ తల్లి చేతిలో నుంచి మాయం చేసి, కాంగ్రెస్ పార్టీ గుర్తు పెట్టడం అన్యాయమని అన్నారు.
తెలంగాణ నా కోటి రథనాల వీణ అని మహాకవి దాశరధి గారు అన్నట్టుగానే నాడు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో అనేక మంది మేధావులు, తెలంగాణ ఆత్మబంధువుల సమక్షంలో ఉద్యమకాలంలో రూపుదిద్దుకున్న తెలంగాణ తల్లిని కేసీఆర్ గారి మీద రాజకీయ కక్షతో తెలంగాణ మీద ఈసమెత్తు కూడా అవగాహన, సోయి లేని వ్యక్తి నేడు కుట్రలు చేయడాన్ని తెలంగాణ సమాజం, ఖమ్మం జిల్లా ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మార్బుల్, బుర్రి వెంకట్, మోతారపు సుధాకర్, పగడాల శ్రీవిద్య, కూరాకుల వలరాజు, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు తాజుద్దీన్ ,బిచ్చల తిరుమలరావు, మేకల సుగుణ రావు, రఘునాధపాలెం మండల మాజీ వైస్ ఎంపీపీ గుత్తా రవి, మాజీ సర్పంచ్ ప్రదీప్,మాజీ కౌన్సిలర్ వంగాల వెంకట్, అన్నపురెడ్డిపల్లి మాజీ జెడ్పిటిసి రాంబాబు, మహిళా నాయకురాలు కొల్లు పద్మ, నగర ప్రచార కార్యదర్శి షకీన, ఉబ్బలపల్లి నిరోషా, ఎస్టీ సెల్ నగర అధ్యక్షుడు సురేష్, చేతి కృష్ణ, భోజడ్ల రామ్మోహన్, షేక్. ఉస్మాన్ మైనారిటీ సెల్ టూ టౌన్ కన్వీనర్ అబ్బాస్,ఎస్సీ సెల్ వన్ టౌన్ కన్వీనర్ నెమలి కిషోర్, పొదిల నాగరాజు, ఉద్యమ కారుడు పగడాల నరేందర్, ఆసిఫ్, బురాన్,వీరేందర్ గౌడ్ ,55వ డివిజన్ అధ్యక్షుడు ఉదయ్ కుమార్, 57వ డివిజన్ సెక్రటరీ సైదా హుస్సేన్ కోటి, గోగుల వీరయ్య, న్యాయవాది మలుసూర్, మున్నా, చంటి, నార్మల వెంకన్న,మాధవి, వెంకట్, వీరేష్ గౌడ్, యాకుబ్ భి,జమీల్, మొగల, రాజు, హరి,తదితరులు పాల్గొన్నారు