డైలీ భారత్, నర్సింహులపేట: మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై మాలోతు సురేష్ హెచ్చరించారు. ఆదివారం మండల పరిధిలోని రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనం నడుపుతున్న కొంతమంది పై కేసు నమోదు చేసారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మద్యం మత్తులో ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే తమ కుటుంబసభ్యుల పరిస్థితి ఏమిటనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే కోర్టులో హాజరు పరుస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రమేష్. ప్రవీణ్. సింగ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు
News
మద్యం సేవించవా.. కటకటాలపాలే : ఎస్ఐ సురేష్