| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అభివృద్ధి గాలికొదిలి.. ప్రతిపక్ష నాయకులపై కక్షపూరిత చర్యలు : లకావత్ గిరిబాబు

అభివృద్ధి గాలికొదిలి.. ప్రతిపక్ష నాయకులపై కక్షపూరిత చర్యలు : లకావత్ గిరిబాబు

హరీశ్ రావుపై తప్పుడు కేసులు పెడితే ప్రజలు సహించరు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి లకావత్ గిరిబాబు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి మాట గాలికి వదిలేసి.. ప్రతిపక్ష నాయకులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వైరా నియోజకవర్గ నాయకుల లకావత్ గిరిబాబు ద్వజమెత్తారు.

గురువారం ఆయన మాట్లాడుతూ..

మాజీమంత్రి హరీశ్ రావు నిజాయితీ, పాలనా దక్షత తెలంగాణ ప్రజలందరికీ తెలుసన్నారు. గతంలో నిరుద్యోగసలను నిండా మంచి ఉద్యోగాల పేరుతో దోచుకున్న దొంగ చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేస్తే పోలీసులు అత్యుత్సాహంతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం దురదృష్టకరమన్నారు. కనీస రాజకీయ అవగాహన లేకుండా పార్టీలు మార్చే చక్రధర్ గౌడ్ మాటలను నమ్మి కేసు నమోదు చేయడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు కేసులను, అబద్దపు ప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్న హరీశ్ రావు గొంతు నొక్కడానికి ప్రభుత్వం అక్రమ కేసులను నమోదు చేస్తోందంటూ ఆరోపించారు. ఎన్ని ఆక్రమ కేసులు, నిర్బంధాలు చేసిన ప్రజల పక్షాన హరీశ్ రావు కొట్లాడి తీరుతారన్నారు.

Previous యూత్ ఉపాధ్యక్షుడిగా పడిగల నరేంద్ర ఎన్నిక
Next జూలూరుపాడు మండల యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా రామిశెట్టి నరేందర్ ఎన్నిక
ADVERTISEMENT