డైలీ భారత్, తిరుపతి : వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు ఓటమిని జీర్ణించుకోలేక తిరుపతి మండలం దుర్గసముద్రానికి చెందిన జ్యోతి కుమార్ యాదవ్ ఓటమి అనంతరం, రోహిత్ శర్మ కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు చూస్తూ చలించిపోయాడు.
అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలాడు. స్నేహితులు వెంటనే అతడిని తిరుపతిలోని ఓ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.