డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో దీక్షా దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వైరా నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దీక్షతో పోరాడారన్నారు. "తెలంగాణ వచ్చోడు.. కేసీఆర్ సచ్చుడో” అనే నినాదంతో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకొచ్చారన్నారు. నాటి దీక్షతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున లేచిందంటూ కేసీఆర్ మడమ తిప్పని పోరాటాన్ని నేతలు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు చావా వెంకట రామారావు, బానోత్ చిన్న, మాజీ సర్పంచ్ భూక్యా రాములు, మాజీ మార్కెట్ డైరెక్టర్ బానోత్ చందర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బానోత్ బిక్కు, మాలోత్ బీమా, బానోత్ చిన్న , అంగోత్ సీతయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.
News
ఘనంగా దీక్షా దివస్ వేడుకలు