దీక్ష దివస్ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి
అమరవీరుల స్థూపానికి ఘనంగా నివాళులు
కెసిఆర్, తెలుగు తల్లి, అమరవీరుల చిత్రపటాలకు పాలాభిషేకం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు అన్ని జిల్లాల ముఖ్య కార్యాలయాల్లో దీక్షా దివస్ నిర్వహిస్తుండగా, వికారాబాద్ జిల్లాలో కూడా జిల్లా కార్యాలయంలో పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఇన్చార్జిగా వ్యవహరించగా దీక్ష దివస్ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఉద్యమకారులతో కలిసి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించడం జరిగింది.
దీక్ష దివస్ కి సంబందించి కెసిఆర్ ఉద్యమ చరిత్ర తెలంగానా సాధనకి సంబందించిన వీడియో అందరూ నాయకులు కార్యకర్తలతో కలిసి వీక్షించడం జరిగింది. అలాగే కెసిఆర్, తెలుగు తల్లి, అమరవీరుల చిత్ర పటాలకి పాలబి షేకం చేయడం, ఉద్యమ కాలం నాటి చరిత్ర, కెసిఆర్ గారి గొప్పతనం, ఉద్యమ కారుల గొప్ప తనం గురుంచి మాట్లాడుకోవడం తో పాటు ఉద్దేశం లో పార్టీకి వెన్నుదన్నుగా ఉండి పార్టీని ముందుకు నడిపించిన ఉద్యమకారులకి సన్మానం చేసారు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా దీక్ష దివస్ ఇంచార్జి ఎమ్మెల్సి నవీన్ రెడ్డి, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షులు మెతుకు ఆనంద్, పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, తాండూర్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, వికారాబాద్, కొడంగల్, తాండూర్, పరిగి నియోజకవర్గాల మాజీ జడ్పి టిసిలు, మాజీ ఎంపిపిలు, పిఎసిఎస్ చైర్మన్లు, సింగిల్ విండో డైరెక్టర్స్, మాజీ ఎంపిటిసిలు, మాజీ సర్పంచులు, ఉద్యమ కారులు మరియు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.