దొంత పురుషోత్తం కుటుంబ సభ్యులు
డైలీ భారత్ ,మహబూబాబాద్: బయ్యారం మండలం కోటగడ్డ గ్రామ పంచాయతీ కీ చెందిన దొంత పురుషోత్తం తండ్రి పట్టాభి రామయ్య కుటుంబ సభ్యులు నేడు బల్వత్ మరణానికి పాల్పడుతుండగా స్థానిక గ్రామ పెద్దలు సద్ది చెప్పడంతో ఆత్మహత్య ప్రయత్నం విరమించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా దొంత పురుషోత్తం మాట్లాడుతూ కోట గడ్డ పరిధిలో నాకు రాజీవ్ గృహ కల్పం కింద రెండు గదుల ఇల్లు మంజూరు కాగా గతంలో నేను నిర్మించుకోవడం జరిగిందని తెలుపుతూ,నా పిల్లల చదువు రీత్యా కోటగడ్డ నుండి మహాబూబాబాద్ కు వచ్చి అద్దె ఇంట్లో కిరాయి ఉంటూ జీవనం కొనసాగిస్తుండగా, 19 నవంబర్ 2022 తారీకు రోజున నా తండ్రి దొంత పట్టాభి రామయ్య స్వర్గీయులు అయినందున నాన్న దశ దిన కర్మలు పూర్తిగా బాధ్యత వహించి నిర్వహించడం జరిగిందని, నాన్న లేకపోవడంతో అమ్మ బాధ్యతను నేనే తీసుకొని నేనుంటున్నటువంటి మహబూబాబాద్ కు
అమ్మను నా కుటుంబంతోనే నాకున్న దానిలోనే అమ్మను చూసుకునేవాడిని, నాన్న పదో నెల మాసం వరకు ఎలాంటి సమస్యలు లేకుండా కాలం గడుస్తూ ఉండగా, మా నలుగురు అక్కా చెల్లెళ్లు మా అమ్మకు లేని పోనివి నేర్పించి నాపై కేసు పెట్టించగా, గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో రాజీ పడడం జరిగింది. నాకు ఎలాంటి సమాచారాన్ని తెలియ పరచకుండా నాకు సంబంధం లేకుండా మా నాన్న సంవత్సరీకము నలుగురు ఆడపిల్లలు నా ఇంటి వద్దనే తెలియ పరచకుండా జరుపుకొని, నన్ను నా కుటుంబాన్ని మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నందున, నేను న్యాయం కొరకు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించగా పెద్దమనుషుల సమక్షంలో నాకు రెండు గదుల ఇల్లు ఇచ్చి నాన్న సంవత్సరికం చేసుకో అని తీర్మానించడం జరిగింది. నేను సంవత్సరీకం చేసిన రోజే నా మేన బావల ద్వారా నాకు, నాభార్య ఫోన్లు చేసి బూతులు తిడుతూ ఇబ్బంది పెట్టాగా, నా భార్య దొంత ఆశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, స్టేషన్లో కోటగడ్డ గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో డిసెంబర్ 6న మాట్లాడదాం, అప్పటి వరకు ఒక గది ఆమె కిచ్చి ఒక గదిలో నువ్వు ఉండు అని చెప్పడం తో, నేను ఒక గదికి తలుపు పెట్టించు కుందామని తలుపు చేసే వ్యక్తికి తాళం ఇచ్చి వెళ్ళగా, గ్రామం లోని కొంత మంది పెద్ద మనుషులు తాళం నిన్ననే పలగ్గొట్టడం జరిగిందని తెలిపారని, పెద్ద మనుషులు తెలియపరచిన విధంగా వారి మాట ప్రకారం ఈరోజు వరకు వేచి చూసి తలాన్ని పగలకొడదాం అని వస్తే ఎందుకు పగల గొట్టడం, తాళం మా దగ్గర ఉంది తీసుకొ అంటూ పెద్ద మనుషులు ఇవ్వగా తాళం తీసి అందులో నా విలువైనటువంటి వస్తువులు, నేను కార్యక్రమం కొరకు తెచ్చుకున్న సామాన్లు అందులోనే పెట్టి వెళ్లిపోవడం జరిగింది. అప్పుడు పెద్దల సమక్షంలో రూమ్ లో సామానులు భద్రపరిచి తాళం వేసి ఉన్నందున నేడు నా ఇంట్లోని సామాగ్రిని తీసుకుందామని వస్తే అందరూ అడ్డుపడుతుండడం తో మనస్థాపానికి గురవుతున్నాం, అందువలన నాకు న్యాయం చేకూర్చాలని కోరుతూన్నానని, లేనియెడల నా కుటుంబ సభ్యులమంతా చావడం తప్ప వేరే ఆలోచన కూడా లేదని తెలపడం జరిగింది.