| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఇందిరాగాంధీ దేశానికి అందించిన నిరుపమాన సేవలు స్ఫూర్తిదాయకం : వీర్లపల్లి శంకర్

ఇందిరాగాంధీ దేశానికి అందించిన నిరుపమాన సేవలు స్ఫూర్తిదాయకం : వీర్లపల్లి శంకర్

షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్

భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది ఇందిరాగాంధీ

షాద్ నగర్ నియోజక వర్గ కేంద్రంలో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు*

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, కేశంపేట రొడ్ చౌరస్తాలో ఇందిరమ్మకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా:భారతదేశపు కీర్తిని ప్రపంచం నలుమూలలా చాటిచెప్పిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ, ఆమె రాజకీయ, వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని శక్తిమంతమైన నాయకురాలిగా భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని ఇందిరాగాంధీ దేశానికి అందించిన నిరుపమాన సేవలు నాటితరం నాయకులకే కాదు నేటితరం నాయకులకు సైతం స్ఫూర్తిదాయకం అని షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ "వీర్లపల్లి శంకర్" కీర్తించారు.

మాజీ దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 15వ జయంతి వేడుకలు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కుంకొల్ల చెన్నయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇంద్ర గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా పట్టణంలోని కేశంపేట చౌరస్తా వద్ద ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ 1917 నవంబర్ 19న అలహాబాద్లోని ఆనంద్ భవన్లో భారత దేశపు తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ దంపతులకు జన్మించారన్నారు. ఆమె అసలు పేరు ఇందిరా ప్రియదర్శిని అని కాగా, లండన్ లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారని తెలిపారు. 1964లో ఆమె తండ్రి, భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మరణం అనంతరం ఇందిరా గాంధీ రాజ్యసభకు ఎన్నికైందనీ లాల్ బహదూర్ శాస్త్రి మంత్రిమండలిలో ప్రసారశాఖ మంత్రిగా ఆమె విశిష్ట సేవలు అందించిందన్నారు. ఈక్రమంలో 1966లో మొదటిసారి ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించి.. దేశ మొదటి మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ చరిత్ర సృష్టించిందన్నారు. కాగా, నేటి వరకు మరో మహిళ భారతదేశ ప్రధాని పదవిని అధిష్టించకపోవడం ఇందిరా గాంధీ ఇప్పటివరకు తొలి మహిళా ప్రధాని కావడం విశేషం అన్నారు. ఇందిరాగాంధీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని బ్యాంకుల జాతీయకరణ, జమీందారీ వ్యవస్థ రద్దు, గరీబీ హఠావో వంటి గొప్ప పథకాలతో భారతదేశ అత్యున్నత ప్రధానిగా ఇందిరాగాంధీ నిరూపించుకున్నారు.

మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ విశ్వం, బాబర్ ఖాన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంకల్ల చెన్నయ్య, కాంగ్రెస్ నేతలు శ్రీకాంత్ రెడ్డి,  వెంకట్ రాంరెడ్డి, జంగ నర్సింహులు, కృష్ణారెడ్డి, బాలరాజు గౌడ్, ఇబ్రహీం, దంగు శ్రీను యాదవ్, సర్వర్ పాషా, మురళి మోహన్అప్పి, జాంగారి రవి, ఎలికట్ట శ్రీశైలం, ఖదీర్, కొప్పనుర్ ప్రవీణ్, నలమొని శ్రీధర్, సింగారం దర్శన్, మాధవులు, దిలీప్ కుమార్, ముబారక్, దేవగిరి నవీన్, అర్జున్ లక్ష్మన్, అన్వర్, సక్రు నాయక్, మన్నే రవి, చిన్న, మార్గం రాజేష్, జాంగారి జంగయ్య, తుప్పరీ శేఖర్, దేవగిరికృష్ణ, వెంకటేష్, లింగారెడ్డి గూడ అశోక్, అప్పరెడ్డి గూడ మల్లేష్, ప్రదీప్, జయ ప్రకాష్, ఓరుగంటి రమేష్, లాంకాల రఘు గౌడ్, రవి కుమార్, క్యూసేట్ శ్రీనివాస్, మనపాటి ప్రదీప్ కుమార్, కుమార్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు..

Previous ఈ.ఎం.ఆర్.ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ నందు ఉద్యోగనియామకాలు
Next సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటన విజయవంతం చేయాలి : నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు
ADVERTISEMENT