షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేతుల మీదుగా రూ.5లక్షల విరాళం
ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణానికి ఎంపీపీ శివశంకర్ గౌడ్ ప్రియాంక గౌడ్ దంపతుల విరాళం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: నాడు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో చదువుకున్న విద్యార్థులు ఎందరో మంచి ప్రతిభతో సమాజంలో ఏదో ఒక రంగంలో రాణిస్తున్నారని అలాంటి ప్రభుత్వ చదువులే ఎంతో మేలని కొత్తూరు మాజీ ఎంపీపీ ఎం శివశంకర్ గౌడ్ అన్నారు. షాద్ నగర్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనానికి ఉమ్మడి కొత్తూరు, నందిగామ మండలాల మాజీ ఎంపీపీ మంచనపల్లి ప్రియాంక శివశంకర్ తన వంతు ఆర్థిక సాయం గా దంపతులు 5 లక్షల విరాళం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాల భవన నిర్మాణం కోసం మాజీ ఎంపీపీలు శివ శంకర్ గౌడ్ ఆయన సతీమణి ప్రియాంక ఇరువురు ఎంతో సేవా భావంతో ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం సంతోషకరమని ఎమ్మెల్యే అన్నారు. ఎంపీపీ శివశంకర్ గౌడ్ మాట్లాడుతూ మొత్తం కళాశాలలో కూడా ఎమ్మెల్యే కట్టే సత్తా ఉన్నప్పటికీ మంచి పని కోసం అందరిని భాగస్వాములు చేయడం ఎంతో గొప్ప విషయం అని అన్నారు. పదిమంది సాయం చేసిన పని చరితలు చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశం ఉంటుందని ఆ అవకాశాన్ని కల్పించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జంగా నరసింహా యాదవ్, జమ్రుద్ ఖాన్, శ్రీశైలం, కొమ్ము కృష్ణ, ముబారక్, హుస్సేన్, చంద్రపాల్ కుమార్ గౌడ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు..