డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఖమ్మం జిల్లా మాల ఉపకులాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో జాతీయ అధ్యక్షులు జి. చెన్నయ్య మాట్లాడుతూ...
రాష్ట్రంలో "హైదరాబాద్ మాలల సింహగర్జన" అనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా, వివిధ జిల్లాల మరియు మండలాల నుండి "హలో మాల, చలో హైదరాబాద్" పేరుతో, సికింద్రాబాద్ పారేడ్ గ్రౌండ్ వద్ద మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని సహకరించాలని కోరారు.
ఈ మహా సమ్మేళనంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, చొప్పదండి ఎమ్మెల్యే మేడేపల్లి సత్యం, వర్ధన్నపేట ఎమ్మెల్యే మరియు రాష్ట్ర అధ్యక్షులు ఆర్. నాగరాజు, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద రంజిత్ కుమార్, జిల్లా మరియు మండల అధ్యక్షులు, రిటైర్డ్ ఎంప్లాయిస్ తదితరులు పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమం మాల ఉపకులాల ఐక్యతను మరియు వారి హక్కుల సాధనకు ఒక చైతన్య వేదికగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.